ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి.. కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:34 PM
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు.
అమరావతి, జులై 20: ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు. అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ(NFDB) ప్రాంతీయ కార్యాలయం అవసరమని లేఖలో తెలిపారు. డీజీఎఫ్‌టీ(DGFT) ద్వారా ఫిష్ మీల్ ఎగుమతిని నియంత్రించాలన్నారు. ఎఫ్‌సీవీ(FCV) పొగాకు ఎగుమతిని ప్రోత్సహించాలని కోరారు. ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించాలన్నారు.
బ్లూ ఎకానమీకి సహకారం ఇవ్వాలని.. DGFT ద్వారా క్రమబద్ధీకరించాలని సీఎం కోరారు. నిర్యాత్ ప్రోత్సాహన్ పథకాన్ని వర్తింపచేయాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.5 లక్షల టాప్ అప్ ఇవ్వాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో సీఎం చంద్రబాబు వినతి చేశారు.
ఇవి కూడా చదవండి...
మంత్రి నిమ్మల సీరియస్.. కాంట్రాక్టర్, అధికారిపై కేసు నమోదు
‘హెల్తీ- వెల్తీ- హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా ముందుకు: మంత్రి అనగాని సత్యప్రసాద్
Read Latest AP News And Telugu News