51 శాతం పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:46 AM
ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదికను వెంటనే బయట పెట్టాలని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) డిమాండ్ చేసింది.
సీపీఎస్ స్థానే ఓపీఎస్ పునరుద్ధరించాలి: టీజీఈజేఏసీ
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదికను వెంటనే బయట పెట్టాలని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) డిమాండ్ చేసింది. చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన జేఏసీ సమావేశం.. 51ు ఫిట్‌మెంట్ వర్తింపజేయాలని డిమాండ్ చేసింది. జూన్ 2లోపు పీఆర్‌సీ నివేదిక తెప్పించుకుంటామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ అమలు కాలేదని ఆక్షేపించింది. ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఆర్థిక భద్రత కల్పించే పెన్షన్ అత్యంత కీలకమని.. ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) స్థానే.. పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News