Share News

ఆగస్టు 3లోగా 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి

ABN , Publish Date - Jul 29 , 2026 | 09:03 PM

ఓటరు జాబితా సవరణ కేవలం తప్పులు లేని ఓటర్ల జాబితా కోసమేనని తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎస్ఐఆర్ (SIR) పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఆగస్టు 3లోగా 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి
TG EC CEO C. Sudharsan Reddy

హైదరాబాద్, జులై 29: ఓటరు జాబితా సవరణ కేవలం తప్పులు లేని ఓటర్ల జాబితా కోసమేనని తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎస్ఐఆర్ (SIR) పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగస్ట్ 3వ తేదీలోగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 76 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. 8 నియోజకవర్గాల్లో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు.


జీహెచ్‌ఎంసీతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ తదితర పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. డిజిటలైజేషన్‌లో నిర్లక్ష్యం వహిస్తే బీఎల్ఓలు, సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకే కుటుంబ సభ్యుల ఓట్లన్నీ.. ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సమావేశాలను వీడియో తీయాలని జిల్లా కలెక్టర్లను సీఈఓ ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీ ఓటర్ల మ్యాపింగ్ చేపట్టాలని వారికి సీఈవో సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎస్ఐఆర్‌కు సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన పునరుద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

చిన్నారి విన్యాసాలు.. సైనికుల ఫిదా.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 09:10 PM