Share News

చిన్నారి విన్యాసాలు.. సైనికుల ఫిదా.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 29 , 2026 | 05:41 PM

సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చిన్న పిల్లల ప్రతిభకు సంబంధించిన వీడియోలూ ఉంటాయి. ఆ కోవలోనే సైనికుల ముందు వేగంగా పుష్‌అప్స్ చేస్తూ.. అద్భుతమైన విన్యాసాలు చేసిన ఓ చిచ్చరపిడుగు వీడియో వైరల్ అవుతోంది.

చిన్నారి విన్యాసాలు.. సైనికుల ఫిదా.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చిన్న పిల్లల ప్రతిభకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ఆ కోవలోనే సైనికుల ముందు వేగంగా పుష్‌అప్స్ చేస్తూ.. అద్భుతమైన విన్యాసాలు చేసిన ఓ చిచ్చరపిడుగు వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సైనికుల ముందు ఆ బాలుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో పుష్‌అప్స్ చేస్తున్నాడు. అది కూడా అతడు ఏదో ఫిట్‌నెస్ పరీక్షకు సిద్ధమవుతున్నట్లుగా ఉంది. సైనికుల ఎదురుగా ఆ బాలుడు అలా పుష్‌అప్స్ చేయడం మొదలుపెట్టాడో లేదో.. ఆ ఉత్సాహాన్ని చూసి అక్కడున్న వారంతా మరింత ఉత్సాహపరిచారు. దీనిని స్థానికులు తమ సెల్‌‌ఫోన్‌లో చిత్రీకరించారు.


ఈ పుష్‌అప్స్ తర్వాత.. సైనికులకు ఆ బాలుడు సెల్యూట్ చేశాడు. సైనికులు కూడా అతడికి తిరిగి సెల్యూట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ బాలుడి ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వారంతా ప్రశంసిస్తూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ బాలుడిని కొందరు చిన్న కమాండో అని సంభోదిస్తున్నారు. చిన్నోడే కానీ.. సైనికుడికి ఉన్న ధైర్యం ఉందని మరికొందరు అంటున్నారు. అతడు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని అంటున్నారు. బాలుడు పుష్‌అప్స్ తీసి.. ఆ వెంటనే సైనికులకు సెల్యూట్ చేయడం.. ఆ వెంటనే వారు స్పందించడం చూడముచ్చటగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

అస్సాం వరదలు.. ఆవు దూడ కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి..

Updated Date - Jul 29 , 2026 | 06:21 PM