Share News

ఎల్ నినో సవాళ్లకు తెలంగాణ సర్కార్ పక్కా ప్రణాళిక: డిప్యూటీ సీఎం భట్టి

ABN , Publish Date - Jul 21 , 2026 | 04:44 PM

ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఎల్ నినోపై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.

ఎల్ నినో సవాళ్లకు తెలంగాణ సర్కార్ పక్కా ప్రణాళిక: డిప్యూటీ సీఎం భట్టి
Dy CM Bhatti Vikramarka

హైదరాబాద్, జులై 21: ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఎల్ నినోపై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రతి గ్రామంలో ఎల్ నినోపై అవగాహన కల్పించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.


రైతులకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. పగటి పూట సోలార్ విద్యుత్ వినియోగం పెంచి ఆర్థిక భారం తగ్గిస్తామని చెప్పారు. ఎల్ నినో కారణంగా వర్షాకాలంలోనూ వేసవిలో ఉన్నంత విద్యుత్ డిమాండ్ ఉందని వివరించారు. గ్రిడ్ స్థిరత్వానికి స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా కూడా ఎల్ నినో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శంషాబాద్‌లో కలకలం.. తెల్లటి సంచిలో రోజుల పసికందు

వైభవంగా ఎల్లమ్మ తల్లి కల్యాణం.. జోగినిలకు ప్రాముఖ్యం: మంత్రి కొండా సురేఖ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 04:58 PM