తెలంగాణ పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పిన డీజీపీ..
ABN , Publish Date - Apr 27 , 2026 | 09:32 PM
తెలంగాణ పోలీసులకు డీజీపీ శివధర్‌రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. పోలీసుల సంక్షేమం దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. పోలీసుల సంక్షేమం దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి పోలీస్ ఉద్యోగి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలకు ప్రత్యేక సెలవు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
పోలీసులు పని కారణంగా వ్యక్తిగత జీవితాలకు సమయం ఇవ్వలేకపోతున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఎప్పుడూ ఒత్తిడిలో పని చేస్తూ ఉన్న కారణంగా కుటుంబంతో గడిపే సమయం ఇస్తే మానసిక ఉల్లాసం పొందుతారని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే ఆయా రోజుల్లో ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
అంబర్‌పేట్ అగ్నిప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు: అడిషనల్ డీసీపీ
తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఒక్కరూ అడ్డుకోలేదు: కేసీఆర్