Share News

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఒక్కరూ అడ్డుకోలేదు: కేసీఆర్

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:30 PM

బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో బీఆర్ఎస్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు.

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఒక్కరూ అడ్డుకోలేదు: కేసీఆర్
BRS Chief KCR

హైదరాబాద్, ఏప్రిల్27: బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఏపీ విభజనపై ఇటీవల లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ మండిపడ్డారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలను సభలో ఒక్కరూ కూడా అడ్డుకోలేదన్నారు. తెలంగాణ పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్నచిత్తశుద్ధి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో తాము పొత్తు పెట్టుకున్నామని వివరించారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు పథకం తీసుకొచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు.


తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. తెలంగాణలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. బొందలో పడినట్లయిందని తెలంగాణ ప్రజలు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. పక్క రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పెద్ద అంబేద్కర్ విగ్రహాన్నీ చూడడానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయడం లేదని కేసీఆర్ మండిపడ్డారు.


ఇది చండాలమైన ప్రభుత్వం.. ఇది చిల్లర ప్రభుత్వం అని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివర్ణించారు. ఆ మాటలు, కూతలు ఏమిటి? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీలోని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 200 మందికి శిక్షణ ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు పార్టీ అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే.. శత్రువు కాదు: సీఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

For More TG News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 07:06 PM