Share News

అంబర్‌పేట్ అగ్నిప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు: అడిషనల్ డీసీపీ

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:35 PM

హైదరాబాద్ అంబర్‌పేట్‌ చౌరస్తాలో మహీంద్రా సర్వీసింగ్ సెంటర్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య వెల్లడించారు.

అంబర్‌పేట్ అగ్నిప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు: అడిషనల్ డీసీపీ

హైదరాబాద్, ఏప్రిల్ 27: నగరంలోని అంబర్‌పేట్‌ చౌరస్తాలో మహీంద్రా సర్వీసింగ్ సెంటర్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య వెల్లడించారు. ఇంకా పొగ క్లియర్ కావాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారని వివరించారు. మొత్తం నాలుగు అగ్నిమాపక శకటాలతో ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో రెనాల్ట్ సర్వీసింగ్ సెంటర్లోని పరికరాలన్నీ కాలి బూడిదయ్యాయని తెలిపారు. వేసవికాలం నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నామని పేర్కొన్నారు.


అలాగే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని అడిషనల్ డీసీపీ నరసయ్య తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా.. ఈ సర్వీసింగ్ సెంటర్ వెనుక వైపు నివసిస్తున్న ప్రజలను మరో ప్రాంతానికి తరలించామన్నారు. వేసవికాలం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉందన్నారు. దీంతో ఇల్లు, కార్యాలయంలోని కరెంట్ వైరింగ్‌ తరచూ తనిఖీ చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు అడిషనల్ డీసీపీ నరసయ్య సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం..

కవిత కొత్త పొలిటికల్ పార్టీని ఎందుకు పెట్టారో చెప్పండి కేటీఆర్: ఎమ్మెల్యే సామేల్

For More TG News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 07:22 PM