కవిత కొత్త పొలిటికల్ పార్టీని ఎందుకు పెట్టారో చెప్పండి కేటీఆర్: ఎమ్మెల్యే సామేల్
ABN , Publish Date - Apr 27 , 2026 | 03:42 PM
మీ సోదరి కవిత ఎందుకు పార్టీ పెట్టారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు రేగు కంపలాగ కవిత తగిలారని వ్యాఖ్యానించారాయన.
హైదరాబాద్, ఏప్రిల్27: మీ సోదరి కవిత ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు రేగు కంపలాగ కవిత తగిలారని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సామేల్.. సీఎం రేవంత్‌పై కేటీఆర్, కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మీ ఇంట్లో ఫ్రస్టేషన్‌ను బయట ఎందుకు చూపిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారని కవిత అడుగుతున్నారని.. ముందు ఆమెకు సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేదని కవిత అంటున్నారని.. నిజంగానే ప్రమేయం లేకుంటే తీహార్ జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలని కవితను ప్రశ్నించారు ఎమ్మెల్యే సామేల్.
అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిని కాదని కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేసిన సామేల్.. దీని వెనక ఉన్న రహస్యమేంటో చెప్పాలని కవితను ప్రశ్నించారు. ఇంటి పోరుతో ఇబ్బంది పడుతున్న మీరు.. మంది జోలికి ఎందుకు పోతున్నారంటూ సెటైర్లు వేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తుపట్టట్లేదని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్‌ను గుర్తుపట్టే స్థలాలు తనకు బాగా తెలుసునని సామేల్ వ్యాఖ్యానించారు. గుంట నక్కలు, తోడేళ్ళు అందరూ మీ వద్దనే ఉన్నారంటూ కేటీఆర్‌పై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీని కదిలించే దమ్ము ఎవరికి లేదని ఎమ్మెల్యే సామేల్ స్పష్టం చేశారు. ఆర్టీసీని ఆగం చేయాలని చూశారని.. కానీ, వారి కుట్రలు ఫలించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు సామేల్.
Also Read:
మెుక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
లద్దాఖ్‌కు కొత్తగా 5 జిల్లాలు.. కేంద్రం నోటిఫికేషన్‌కు ఎల్జీ ఆమోదం
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. స్థానికులను తరలిస్తున్న పోలీసులు