26న హైదరాబాద్‌లో సంవిధాన్ రక్షా మార్చ్
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:53 AM
‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26న టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సంవిధాన్ రక్షా మార్చ్ జరగనుంది.
పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26న టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సంవిధాన్ రక్షా మార్చ్ జరగనుంది. ఈ మార్చ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులతో జూమ్ ద్వారా సమావేశమైన మహేశ్‌గౌడ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున విజయవంతం చేయాలని వారికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ బీమా పథకం, కొత్త పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లను ఓట్ రక్షకులుగా నియమించామని, వారు ఇక నుంచి ఆయా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఇవి కూడా చదవండి...
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..
ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..
Read Latest National News And Telugu News