సోమవారం నుంచే హెల్త్ వీక్.. ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలు..
ABN , Publish Date - Apr 05 , 2026 | 09:03 PM
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి హెల్త్ వీక్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ మేరకు 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా సోమవారం నుంచి హెల్త్ వీక్ కార్యక్రమం చేపట్టనుంది. తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించనున్నారు. సోమవారం నాడు నెక్లెస్ రోడ్డులో సుమారు వెయ్యి మందితో ఆహార భద్రతపై అవేర్‌నెస్ వాక్ చేయనున్నారు. ఉదయం 6:30 గంటలకు జల విహార్ వద్ద వాకథాన్‌ను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వరకూ వాకథాన్ సాగనుంది.
ఈ మారథాన్‌లో మంత్రితోపాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, విద్యార్థులు, ఎన్‌జీవోల ప్రతినిధులు పాల్గొనున్నారు. ఉదయం 10 గంటల నుంచి నేచురోపతి హాస్పిటల్‌లో ఈట్ రైట్ మేళా నిర్వహిస్తారు. నాణ్యమైన ఆహార పదార్థాలతో 40 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా మిల్లెట్లతో చేసిన ఆహార పదార్థాలు నిలువనున్నాయి. ఫుడ్ సేఫ్టీ, పోషకాహారంపై అంగన్‌వాడీలకు ట్రైనింగ్ కార్యక్రమాన్నీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సభలో మంత్రి పాల్గొననున్నారు. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు, హోటళ్లకు హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్లను సైతం మంత్రి రాజనర్సింహ అందజేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
క్రీడా వసతుల కల్పనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
తీవ్ర విషాదం.. ఎస్ఆర్ఎస్‌పీ కెనాల్‌లో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..