క్రీడా వసతుల కల్పనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Apr 05 , 2026 | 08:45 PM
హైదరాబాద్ లోని గచ్చిబౌలి వేదికగా జరిగిన ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 5: హైదరాబాద్ లోని గచ్చిబౌలి వేదికగా జరిగిన ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేవలం అతిథిగా ప్రసంగించడమే కాకుండా, మైదానంలో క్రీడాకారులతో కలిసి కాసేపు ఫుట్‌బాల్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. జాతీయ స్థాయి పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించడం పట్ల ఆయన హర్ష వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ ఈ టోర్నీకి బి.ఎన్.మల్లిక్ పేరు పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. దేశానికి పోలీస్ స్పైగా మల్లిక్ అందించిన సేవలు వెలకట్టలేనివి. ఒకప్పుడు ఫుట్‌బాల్ క్రీడకు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది, ఇక్కడ నుంచి ఎంతోమంది క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించారు. దేశంలో యువతకు సరైన క్రీడా వసతులు లేవు. ఒలింపిక్స్ పథకాల గెలుపులో మనకంటే చాలా చిన్న దేశాలు ముందున్నాయి.140 కోట్ల మంది జనాభా ఉన్న మనం.. ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేకపోవడం బాధాకరం. ఇటీవల క్రీడా సదుపాయాల కల్పనపై అధ్యయనానికి దక్షిణ కొరియాలో పర్యటించాం. హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. వివిధ క్రీడల్లో ప్రముఖులను స్పోర్ట్స్ వర్సిటీలో భాగస్వాములను చేశాం’ అని అన్నారు.
‘ఇటీవల బాగా చదువుకునే యువతనే డ్రగ్స్ బారిన పడుతున్నారు. దేశ స్వాత్యంత్య్ర కోసం ఒక్కప్పుడు పంజాబ్ వీరులను అందించింది. కానీ, ఇప్పుడు డ్రగ్స్ భారిన పడి జీవితాలు నాశనం చేసుకున్నారు. మరో పంజాబ్ గా తెలంగాణని కానివ్వం. డ్రగ్స్, సైబర్ నేరాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులది. యువత సరైన దిశలో వెళ్లకపోతే భవిష్యత్తులో తీరని నష్టం జరుగుతుంది. యువతకు మార్గ నిర్దేశం చేయాలని హైదరాబాద్‌కు ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీని తీసుకువచ్చాను. బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరిన్‌కు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు 2 కోట్ల నగదు పురస్కారం అందించాం. క్రికెటర్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. ఫారా ఒలింపిక్స్‌లో రాణించిన దీప్తి జురాంజి కి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం. క్రీడల్లో రాణించే తెలంగాణ యువతకు ఉద్యోగాలు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్..
ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్..