Share News

ఓట్‌ బచావ్‌ ర్యాలీ ఏర్పాట్లపై సమన్వయ కమిటీ

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:40 AM

ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నవంబర్‌ ఒకటో తేదీన ఇండి కూటమి ఆధ్వర్యంలో జరిగే ‘ఓట్‌ బచావ్‌ - దేశ్‌ బచావ్‌’ ర్యాలీకి బస్సుల్లో వెళ్లే నాయకుల రవాణా, వసతి సౌకర్యాల కల్పనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.

ఓట్‌ బచావ్‌ ర్యాలీ ఏర్పాట్లపై సమన్వయ కమిటీ
Vote Bachao Desh Bachao rally

  • హస్తినకు బస్సుల్లో టీపీసీసీ తరలింపు..?

  • ప్రత్యేక రైళ్లకు రైల్వేశాఖ ‘నో’.. విమాన చార్జీలు తడిసి మోపెడు

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నవంబర్‌ ఒకటో తేదీన ఇండి కూటమి ఆధ్వర్యంలో జరిగే ‘ఓట్‌ బచావ్‌ - దేశ్‌ బచావ్‌’ ర్యాలీకి బస్సుల్లో వెళ్లే నాయకుల రవాణా, వసతి సౌకర్యాల కల్పనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ఎంపీలు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్‌ సభ్యులుగా ఉంటారు. ఈ ర్యాలీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం.. రాష్ట్రం నుంచి కనీసం 15 వేల మందిని తరలించాలని లక్ష్యాన్ని నిర్దేశించడం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌గా మారింది.


ప్రత్యేక రైలు కేటాయించాలని కోరగా, రైల్వేశాఖ అధికారులు నిరాకరించారని హస్తం పార్టీ వర్గాలు తెలిపాయి. ఇండి కూటమి ర్యాలీ వల్ల ఢిల్లీ ప్రయాణానికి డిమాండ్‌ ఎక్కువైంది. దీంతో విమాన టికెట్‌ ధర భారీగా పెరిగిందని, దాదాపు రూ.20 వేల వరకూ ఖర్చవుతుందని ఆ వర్గాల కథనం. ఈ నేపథ్యంలోనే హస్తినకు నేతలను బస్సుల్లో తరలించాలని టీపీసీసీ ఆలోచిస్తోంది. తెలంగాణ - ఢిల్లీ మధ్య బస్సు ప్రయాణం 36 గంటలు, అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. టీపీసీసీ ఆలోచన కార్యరూపం దాల్చితే ఆ పార్టీ నేతలు ఈనెల 30నే ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంటుందంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక్కో జిల్లా నుంచి ఎంత మంది నేతలు వస్తారన్న విషయమై నివేదికివ్వాలని డీసీసీ అధ్యక్షులను ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

వరిసాగుతో కరీంనగర్‌ కళకళ

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 06:40 AM