Share News

ఏసుక్రీస్తు త్యాగం, ధైర్యం మరువలేనివి: సీఎం రేవంత్ రెడ్డి..

ABN , Publish Date - Apr 02 , 2026 | 09:31 PM

ఏసుక్రీస్తు త్యాగం, ధైర్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిలషించారు.

ఏసుక్రీస్తు త్యాగం, ధైర్యం మరువలేనివి: సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy

హైదరాబాద్: గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నాయి. ప్రజల పాపాలను హరించేందుకు సిలువపై ఏసుక్రీస్తు ఉరివేయపడిన రోజు కావడంతో ఆయన్ని స్మరించుకుంటూ ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తు త్యాగం, ధైర్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.


ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిలషించారు. శాంతి, కరుణ సందేశాలతోపాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమ‌ని అన్నారు. ఏసుక్రీస్తు త్యాగాలకు జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడేను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల కేసులో ఏడుగురి అరెస్టు..

ఐపీఎల్ 2026: సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ 226

Updated Date - Apr 02 , 2026 | 09:35 PM