చెరువుల కబ్జాను బీఆర్ఎస్ అడ్డుకోలేదు: సీఎం రేవంత్
ABN , Publish Date - Mar 08 , 2026 | 09:42 PM
హైదరాబాద్ మహానగరంలో చెరువుల కబ్జాకు గురవుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కబ్జాలకు గురైన చెరువులను హైడ్రా కాపాడి పునరుద్ధరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్, మార్చి 08: మహానగరంలో చెరువుల కబ్జాకు గురవుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కబ్జాలకు గురైన చెరువులను హైడ్రా కాపాడి పునరుద్ధరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం శివరాంపల్లిలోని హైడ్రా పునరుద్ధరించిన బుమ్‌రుఖ్‌ఉద్దౌలా చెరువును సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పునరుద్ధరించిన చెరువుల దగ్గర స్టాళ్లు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామని ప్రకటించారు.
కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో చెరువులు కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు కూడా చెరువులు లేకుండా చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బహదూర్‌పురా ఎమ్మెల్యే ముహమ్మద్ ముబీన్, ఎంఎల్సీ మీర్జా రహమత్ బేగ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ స్టేడియంలో ఎఫ్ఐఏ హాకీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ -2026 టోర్నమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ తదితరులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్రమంగా గ్రావెల్ తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు
కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు పూర్తిగా వినియోగిస్తాం: మంత్రి ఉత్తమ్
For More TG News And Telugu News