సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:20 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. శుక్రవారం న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. శుక్రవారం న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సీఎంలు, ఇతర ప్రముఖుల పర్యటనలను.. రాజకీయ క్లియరెన్స్ కోసం అంచనా వేస్తామని ఆయన వివరించారు.
ప్రతిపాదిత కార్యక్రమం పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని ఈ సందర్భంగా జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటన అంశంలో అలా లేదన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటనకు క్లియరెన్స్ నిరాకరించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
10 రోజుల విదేశీ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి లండన్‌కు బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కోసం న్యూఢిల్లీ వెళ్లిన ఆయన బుధవారం అర్థరాత్రి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విదేశాలకు వెళ్లారు. ముందుగా అనుకున్న ప్రకారం.. ఆగస్టు 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాల్లో సీఎం బృందం పర్యటించనుంది. ఈ రెండు దేశాల్లోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి తెలంగాణలో ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై ఈ బృందం చర్చించనుంది. అలాగే లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సీఎం బృందం సందర్శించనుంది. అక్కడి ఎమిరేట్స్ స్టేడియంలో ఫుట్‌బాల్ ప్రజెంటేషన్‌లో పాల్గొనుంది.
అనంతరం యూఎస్‌కు సీఎం బృందం బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వ లేదు. దాంతో ఆయన లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అయితే యూఎస్ పర్యటనకు వెళ్లాలని అధికారుల బృందాన్ని సీఎం రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం: మంత్రి నారాయణ ఫైర్
ప్రియాంక మృతి కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
For More TG News And Telugu News