ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం: మంత్రి నారాయణ ఫైర్
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:59 PM
ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు.
ఉయ్యూరు, ఆగస్టు21: ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. అలాగే స్థానిక 5వ వార్డులో డయేరియా సోకిన ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఉయ్యూరుతో పాటు పరిసర గ్రామాల్లో మొత్తం 11 మంది డయేరియాతో ఆసుపత్రిలో చేరారని వివరించారు. కేవలం ఆరుగురు మాత్రమే ఉయ్యూరు మున్సిపాల్టీ పరిధిలో ఉన్నారని పేర్కొన్నారు. వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.
అయితే ఓ వ్యక్తి ఆగస్టు 17వ తేదీన గుండె పోటు సమస్యతో ఆసుపత్రిలో చేరి మృతి చెందారని మంత్రి నారాయణ తెలిపారు. ఆ వ్యక్తి మృతికి, డయేరియాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేసే నీటి లైన్‌కు, ఇతర గ్రామాల్లోని నీటి సరఫరా లైన్లకు సంబంధం లేదని వివరించారు. డయేరియాకు కారణం మున్సిపల్ పైప్ లైన్ కాలుష్యమా?.. లేక ఆర్వో ప్లాంట్ల సమస్యా? అనేది తేలాల్సి ఉందని అన్నారు.
ప్రాథమిక పరీక్షల ప్రకారం తాగు నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని తేలిందని మంత్రి నారాయణ వివరించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లోని పాత పైప్‌లైన్లను మారిస్తున్నామని చెప్పారు. ఉయ్యూరుకు రూ. 98 కోట్లతో అమృత్ 2.0 కింద పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంత్రి నారాయణ వెంట ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్, జేసీ నవీన్ ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రియాంక మృతి కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
రైల్వే ట్రాక్‌పై ఏనుగులు.. దూసుకొచ్చిన రైలు.. వీడియో పోస్ట్ చేసిన సీఎం
For More AP News And Telugu News