ప్రియాంక మృతి కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:14 PM
పీజీ వైద్య విద్యార్థి ప్రియాంక మృతి కేసులో నిందితులకు విధించిన రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. నిందితులు సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌లకు 14 రోజుల పాటు కోర్టు శుక్రవారం రిమాండ్ విధించింది.
రాజమండ్రి, ఆగస్టు21: పీజీ వైద్య విద్యార్థి ప్రియాంక మృతి కేసులో నిందితులకు విధించిన రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. నిందితులు సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌లకు 14 రోజుల పాటు కోర్టు శుక్రవారం రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు వారికి ఈ రిమాండ్ విధించింది. రెండు రోజుల కస్టడీ పూర్తికావడంతో నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బందికి పోలీసులు అప్పగించారు.
ఆగస్టు 3వ తేదీ రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద మద్యం మత్తులో సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ కారును వేగంగా నడిపారు. ఆ సమయంలో స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను ఆ కారుతో బలంగా ఢీకొట్టారు. దీంతో స్కూటీపై నుంచి వైద్య విద్యార్థి ప్రియాంక కింద పడిపోయింది. ఆమెను పలుమార్లు కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.
అనంతరం కారులో వారు పరారయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. ప్రియాంకను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆగస్టు 9వ తేదీన ప్రియాంక మరణించింది.
ప్రియాంక మృతి కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. అందులో భాగంగా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఐపీఎస్ అధికారి పాటిల్ మనీష్ దేవరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసులో గురువారం నిందితులతో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
రైల్వే ట్రాక్‌పై ఏనుగులు.. దూసుకొచ్చిన రైలు.. వీడియో పోస్ట్ చేసిన సీఎం
దసరాలోపు ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన సేవలు: మంత్రి ఆనం
For More AP News And Telugu News