Share News

దసరాలోపు ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన సేవలు: మంత్రి ఆనం

ABN , Publish Date - Aug 21 , 2026 | 02:39 PM

ఇంద్రకీలాద్రిపై రానున్న దసరా పండగలోపు భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఇంద్రకీలాద్రి కొండ దిగువన రూ.52 కోట్లతో నిర్మించిన అన్నదాన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు.

దసరాలోపు ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన సేవలు: మంత్రి ఆనం
AP Minister Anam Ramanarayana Reddy

విజయవాడ, ఆగస్టు21: ఇంద్రకీలాద్రిపై రానున్న దసరా పండగలోపు భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఇంద్రకీలాద్రి కొండ దిగువన రూ.52 కోట్లతో నిర్మించిన అన్నదాన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ.. ఒకేసారి 800 మంది కూర్చొని భోజనం చేసేలా ఈ భవనాలు నిర్మించామని తెలిపారు. మెకనైజ్డ్ కిచెన్‌కు కొత్త టెక్నాలజీ వినియోగిస్తున్నామని వివరించారు.


ఏడాదికి 3 కోట్ల మందికి ఏపీ దేవాలయల్లో అన్నదానం జరుగుతోందని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రికి రెండో ఘాట్ రోడ్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన నివేదిక సిద్ధమవుతుందని అన్నారు. త్వరలో టెండర్స్ పిలుస్తామని చెప్పారు. 25 అడుగుల ఆదిశంకరాచార్యులు విగ్రహాన్ని ఘాట్ రోడ్‌లో ఏర్పాటు చేయాలని కంచి పీఠం వారు కోరారని.. అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. రాష్ట్రంలోని ఆలయాలకు భక్తుల సంఖ్య పెరిగిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.


దసరా పనులు ప్రారంభం.. : ఎంపీ కేశినేని చిన్ని

రూ.50 కోట్ల నిధులతో కొత్త అన్నదాన భవనాలు ప్రారంభమయ్యాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో ఇంద్రకీలాద్రిపై మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఎంపీ కేశినేని చిన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

అన్నవరం బస్టాండ్‌‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు..

అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు

For More AP News And Telugu News

Updated Date - Aug 21 , 2026 | 03:07 PM