Share News

తెలంగాణలో జనగణన-2027 తేదీలు ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటి సర్వే

ABN , Publish Date - Nov 09 , 2026 | 04:50 PM

తెలంగాణలో జనగణన -2027కు రాష్ట్ర ప్రభుత్వం తేదీలు ఖరారు చేసింది. అందుకు సంబంధించిన జీఓ ఎంఎస్ నెం.155ను ప్రభుత్వం జారీ చేసింది.

తెలంగాణలో జనగణన-2027 తేదీలు ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటి సర్వే
TG Govt

హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలో జనగణన -2027కు తెలంగాణ ప్రభుత్వం తేదీలు ఖరారు చేసింది. అందుకు సంబంధించిన జీఓ ఎంఎస్ నెం.155ను సోమవారం ప్రభుత్వం జారీ చేసింది. జనవరి 25వ తేదీ నుంచి ఇంటింటి జనాభా లెక్కల సేకరణ చేపడతారు. ఫిబ్రవరి 28 వరకు ఈ జనగణన ప్రక్రియ కొనసాగుతోంది. అయితే జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు స్వీయ జనగణనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.


ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ వెసులుబాటు కల్పించింది. ఇక మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజనల్ రౌండ్ చేపట్టనుంది. 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు ప్రామాణిక తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను తెలంగాణ గెజిట్‌లో ప్రభుత్వం పున: ప్రచురించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు.. యువకుడి అరెస్ట్

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 04:57 PM