Share News

తెలంగాణ క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలి: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ABN , Publish Date - Aug 29 , 2026 | 01:39 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని అన్నారు. ముఖ్యమంత్రిని పని చేసుకోనివ్వాలని, ఆటంకాలు సృష్టించకూడదని చెప్పారు.

తెలంగాణ క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలి: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutta Sukhender Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని అన్నారు. ముఖ్యమంత్రిని పని చేసుకోనివ్వాలని, ఆటంకాలు సృష్టించకూడదని చెప్పారు. కాంగ్రెస్ క్యాడర్‌లో అసంతృప్తి ఉందని.. కానీ, కాంగ్రెస్ పాలనపై సాధారణ ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన కీలక విషయాలపై స్పందించారు.


మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తూనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త వాటిని అమలు చేస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రివర్గంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయ్యిందని, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే కొత్తదనం వస్తుందన్నారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీలోనూ క్రమశిక్షణ లేదని, కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు తగ్గించాలన్నారు. అదేవిధంగా పార్టీ లైన్ దాటిన వారిపై వేటు వేయకపోతే నష్టం జరుగుతుందన్నారు. పార్టీలో లీకేజీలను కంట్రోల్ చేయాలని, క్రమశిక్షణ ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు.


మరోవైపు, నాలుగు పంటలకూ రైతు భరోసా అందించాలని శాసన మండలి ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-Aని రద్దు చేయాలని సూచించారు. ప్రజలకు ఉచిత పథకాలను తగ్గించాలని, నిజమైన లబ్ధిదారులకే వాటిని అందించాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయొద్దని, వారికి న్యాయం చేయాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్

నేపాల్ వరదల్లో గల్లంతైన హైదరాబాదీ కుటుంబం.. రంగంలోకి సర్కార్!

Updated Date - Aug 29 , 2026 | 01:59 PM