TBJP Chief Ramchander Rao: కవిత ఆరోపణలు.. చర్యలు తీసుకోని సీఎం: టీ బీజేపీ చీఫ్
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:47 PM
కల్వకుంట్ల కవిత సోమవారం శాసన మండలికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మండలిలో తనది ఇదే చివరి ప్రసంగమంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
హైదరాబాద్, జనవరి 05: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ స్థాపించే అంశం ఆమె వ్యక్తిగతమని టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీ పెట్టే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్, హరీష్‌రావు, కేటీఆర్‌పై కవిత ఆరోపణల ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు.
అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి కవిత సిద్ధంగా ఉన్నా.. చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ను కాపాడుతోంది.. సీఎం రేవంత్‌రెడ్డేనని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటే అనడం ఎమ్మెల్సీ కవిత అవగాహనా లోపమని తెలిపారు.
సోమవారం నాడు శాసన మండలికి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మండలిలో తనది ఇదే చివరి ప్రసంగమని కన్నీరు పెట్టుకున్నారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా తాను మళ్లీ చట్ట సభల్లోకి వస్తానంటూ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్‌తోపాటు తాను ఎదుర్కొన్న పరిస్థితులు, బీఆర్ఎస్ పార్టీపై కవిత హాట్ కామెంట్స్ చేశారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఈ సందర్బంగా కవిత విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచ తెలుగు మహాసభలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఊహించని విధంగా ధాన్యం కొనుగోళ్లు... ఇది ఓ చరిత్ర: మంత్రి నాదెండ్ల
For More TG News And Telugu News