ప్రపంచ తెలుగు మహాసభలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jan 05 , 2026 | 03:01 PM
గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ కార్యక్రమానికి విచ్ఛేశారు. ప్రపంచంలో తెలుగు జాతి నంబర్ వన్‌గా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తెలుగు జాతి నంబర్ వన్‌గా ఉండాలంటే.. మనం ఐకమత్యంగా ఉండాలన్నారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా.. తెలుగే మాతృభాషగా ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
1/10
గంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్ఛేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఘన స్వాగతం పలికారు.
2/10
ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికిన గజల్ శ్రీనివాస్.
3/10
రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదన్నారు.
4/10
ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సీఎం చంద్రబాబుకు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు, తెలుగు మహాసభల ప్రతినిధులు సాదరంగా ఆహ్వానించారు.
5/10
ఈ సభకు విచ్ఛేసిన గోవా గవర్నర్ పి.అశోక్ గజపతి రాజును సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
6/10
ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి.. అన్ని మాట్లాడటం లేదని.. ఐక్యత గురించే మాట్లాడతానని సీఎం చెప్పారు. నీటి విషయమైనా.. సహకారం విషయంలోనైనా కలిసి ఉండాలని తెలుగువారికి ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
7/10
ప్రపంచ మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులను ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని ప్రకటించారు సీఎం. 'విలువలు నేర్పేది సంస్కృతి.. ఆ సంస్కృతికి మూలం భాష.. అందుకే భాషాభివృద్ధికి తాను పూర్తి సహకారమందిస్తాను' అని ఆయన అన్నారు.
8/10
వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించాలని కోరగా.. దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు. మాతృభాషాభివృద్ధికి, తెలుగు జాతి ఔన్నత్యానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.
9/10
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఉన్నతాధికారులు
10/10
సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిన జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు
Updated at - Jan 06 , 2026 | 05:45 PM