టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు నివాసం వద్ద హైటెన్షన్..
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:33 AM
హౌస్ అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు.. కామారెడ్డి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అయితే, కామారెడ్డి వెళ్లేందుకు అనుమతి లేదంటూ ఆయనకు పోలీసులు స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 22: హౌస్ అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు.. కామారెడ్డి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. కామారెడ్డి వెళ్లేందుకు అనుమతి లేదంటూ ఆయనకు పోలీసులు స్పష్టం చేశారు. ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో బీజేపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున్న నినాదాలు చేశారు. పోలీసుల ఆంక్షలపై రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రామచందర్ రావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పలువురు కార్యకర్తలను సైతం అరెస్ట్ చేశారు. రాంచందర్ రావుతో సహా అందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కామారెడ్డి వెళ్లి తీరుతాం: టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
శ్రీశైలంలో భక్తులకు తృటిలో తప్పిన ప్రమాదం
For More TG News And Telugu News