ఒక్కో బార్‌కు 214 దరఖాస్తులు
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:01 AM
రాష్ట్రంలో కొత్త బార్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. సగటున ఒక్కో బార్‌కు 214 దరఖాస్తుల చొప్పున.. కేవలం 41 బార్ల కోసం ఏకంగా 8,770 దరఖాస్తులు రావడం గమనార్హం.
హైదరాబాద్, అక్టోబర్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త బార్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. సగటున ఒక్కో బార్‌కు 214 దరఖాస్తుల చొప్పున.. కేవలం 41 బార్ల కోసం ఏకంగా 8,770 దరఖాస్తులు రావడం గమనార్హం. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున ఫీజుతో సర్కారుకు రూ.87.70 కోట్ల ఆదాయం సమకూరింది. అధికారులు శుక్రవారం డ్రా పద్ధతిలో వ్యాపారులను ఎంపిక చేశారు. ‘క్యూర్’ పరిధిలోని 14 బార్లకు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సి. హరికిరణ్ ఆ ధ్వర్యంలో డ్రా నిర్వహించగా, మిగతా జిల్లాల్లోని 27 బార్లకు ఆయా జిల్లాల కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియను చేపట్టారు.
ఎంపికైన వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే బార్ అనుమతి పత్రాలను అందజేశారు. కాగా, క్యూర్ పరిధిలోని 14 బార్లకు భారీగా డిమాండ్ కనిపించింది. మొత్తం 4251 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో బార్‌కు 303 మంది పోటీపడ్డారు. ఇక జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 27 బార్ల కోసం 4,519 దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో బార్‌కు 167 మంది వ్యాపారులు పోటీపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ వాటాను తోడేస్తున్న కర్ణాటక రైతులు
Read Latest AP News And Telangana News And International