ఆయుష్ విభాగంలో 70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:19 AM
ఆయుష్ విభాగంలో లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఆయుష్ విభాగంలో లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్య విధానాలకు సంబంధించి 45 స్పెషాలిటీల్లో 70 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 70 ఖాళీల్లో లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి.
హోమియోపతి విభాగంలో 11 స్పెషాలిటీల్లో, యునానీ విభాగంలో లెక్చరర్ పోస్టులతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఆయుర్వేద విభాగంలో 14 లెక్చరర్ స్పెషాలిటీలతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 నుంచి ఎంహెచ్‌ఎస్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 2 వరకు గడువు ఉంది.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
Read latest Telangana News And Telugu NEws