ఏడో రోజుకు చేరిన అసెంబ్లీ సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధమైన సభ్యులు..
ABN , Publish Date - Mar 26 , 2026 | 09:02 AM
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఆరు రోజులపాటు వాడివేడిగా సాగాయి. సమావేశాలు నేటితో ఏడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుండగా.. స్పీకర్ ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఆరు రోజులపాటు వాడివేడిగా సాగాయి. సమావేశాలు నేటితో ఏడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుండగా.. స్పీకర్ ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం పద్దులపై విస్తృత చర్చ జరపనున్నారు. ఈరోజు ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, బీసీ వెల్ఫేర్, ట్రాన్స్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమం, గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ వంటి కీలక విభాగాల పద్దులపై చర్చ జరగనుంది. మరోవైపు ఇరిగేషన్, సివిల్ సప్లై పద్దులపై ఈనెల 29వ తేదీకి చర్చను వాయిదా వేశారు.
ప్రశ్నోత్తరాల్లో చర్చించే అంశాలివే..
ప్రశ్నోత్తరాల సమయంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పోలీస్ కానిస్టేబుళ్ల పదోన్నతులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిల చెల్లింపులు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుల పదోన్నతులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే ఖానాపూర్ నియోజకవర్గంలో రహదారి సౌకర్యాల అభివృద్ధి, రాష్ట్రంలో నూతన పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, వలస కార్మికులకు కుల ధ్రువీకరణ పత్రాలు, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, ఐనవోలులో హరిత కాకతీయ హోటల్, చట్ట విరుద్ధమై బెట్టింగ్ యాప్‌లపై చర్యలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక, తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే 2026 తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(GST) సవరణ బిల్లుపై సభలో చర్చ జరిపి ఆమోదం తెలపనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
భద్రాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. నేడు సీతారాముల 'ఎదుర్కోలు' ఉత్సవం!
బేగంబజార్‌లో నకిలీ బ్రాండ్ కొబ్బరి పొడి కేంద్రం