రైతు ప్రయోజనాలు, పారదర్శక మార్కెట్ వ్యవస్థే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jul 26 , 2026 | 08:29 PM
రైతు ప్రయోజనాలు, పారదర్శక మార్కెట్ వ్యవస్థే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
హైదరాబాద్, జులై 26: రైతు ప్రయోజనాలు, పారదర్శక మార్కెట్ వ్యవస్థే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. అందుకోసం 6 ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ వారంలో అన్ని మార్కెట్ కమిటీల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని చెప్పారు.
ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలు, గిట్టుబాటు ధరలే లక్ష్యమని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల పనితీరుపై ప్రత్యేక పరిశీలన చేపట్టినట్లు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడతామని అన్నారు. డిస్ట్రెస్ సేల్స్‌కు కారణాలపై ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆరా తీశారు.
మార్కెట్ సెస్ ఎగవేతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. వేలం ప్రక్రియ పారదర్శకతపై ఆయన సమీక్షించారు. డిజిటల్ సేవలు, రికార్డుల నిర్వహణపై తనిఖీలు చేస్తామని తెలిపారు. ప్రతివారం ప్రభుత్వానికి తనిఖీ నివేదికలు అందిస్తామని వివరించారు. వచ్చే వారం దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళా: మంత్రి తుమ్మల
జులై 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో విత్తన మేళ నిర్వహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొత్తం 33 జిల్లాల్లోని ప్రతి మండల రైతు వేదికలో విత్తన మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఎల్ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలకు ప్రాధాన్యం ఏర్పడిందని అన్నారు. ప్రతి రైతు వేదికలో 4 నుంచి 5 ప్రత్యేక విత్తన కౌంటర్లు ఉంటాయని వివరించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడానికి PJTAU, SKLTU, IIMR, IIOR శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటామని అన్నారు. కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలతో పంటల ఎంపికపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల నుంచి సాగు మార్గదర్శకాలు తీసుకుంటామని చెప్పారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలపై వారితో రైతులకు ప్రత్యేక సూచనలు ఇప్పి్స్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం: ఏపీ టీడీపీ చీఫ్
భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని.. షెడ్యూల్ ఇదిగో..
For More TG News And Telugu News