ఏసీబీ వలలో ఇద్దరు మహిళా అధికారులు
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:20 AM
లంచం తీసుకుంటూ ఇద్దరు మహిళా అధికారులు సోమవారం ఏసీబీకి చిక్కారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.
లక్ష తీసుకుంటూ దొరికిపోయిన రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో
ఫిజియో థెరపీ కేంద్రానికి లైసెన్స్ ఇచ్చేందుకు 2 లక్షలు డిమాండ్
రూ.4 లక్షలు తీసుకుంటూ దొరికిన జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి సునీత
నిర్మాణ అనుమతులకు రూ.8 లక్షలు డిమాండ్
హైదరాబాద్/సిటీ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): లంచం తీసుకుంటూ ఇద్దరు మహిళా అధికారులు సోమవారం ఏసీబీకి చిక్కారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఎల్‌బీనగర్‌లో అనుమతి లేకుండా నడుపుతున్న ఓ ఫిజియోథెరపీ కేంద్రంపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, కొత్త లైసెన్స్ జారీ చేసేందుకు డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి రూ.2లక్షల మేర లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి నుంచి రూ.లక్ష తీసుకున్న హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ డబ్బులు ముట్టాయని డీఎంహెచ్‌వోకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత ఫిజియోథెరఫీ కేంద్రాన్ని తెరవడానికి రూ.3500లతో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకురమ్మని పంపారు.
ఈలోగా లంచంగా తీసుకున్న మొత్తాన్ని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న మద్దురి క్రిష్ణయ్యకు ఇచ్చారు. లంచం డబ్బును కారులో పెట్టేందుకు క్రిష్ణయ్య తీసుకెళ్తుండగా ఏసీబీ డీఎ్‌సపీ శ్రీధర్ బృందం పట్టుకుంది. రికార్డులన్ని పరిశీలించిన తర్వాత స్వర్ణకుమారిని శివరాంపల్లిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. పెద్దఅంబర్‌పేట్ పరిధిలోని న్యూలైఫ్ విల్లా్‌సలో ఉన్న స్వర్ణకుమారి నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం డీఎంహెచ్‌ఓతో పాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్, ప్రైవేటు డ్రైవర్‌లను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు
మెహిదీపట్నం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న సునీత డిప్యూటీ కమిషనర్ జారీ చే సిన ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణ అనుమతులకు రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్ జోన్ కార్యాలయం బయట రూ.4లక్షలు లంచం తీసుకున్న సునీత ఆ మొత్తాన్ని తన కారులో పెట్టిస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచం కాకుండా అదనంగా లెక్కల్లో చూపని రూ.2.50 లక్షల నగదును కూడా అధికారులు గుర్తించారు. మొత్తం రూ.6.5 లక్షలు స్వాధీనం చేసుకొని, సునీతను ఆరెస్టు చేశారు. ఆమె నివాసంలో డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి...
రూ.7,635 కోట్ల ట్రూ-అప్ గండం
అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా, నలుగురు మహిళల మృతి
రామ జన్మభూమి ఉద్యమం నుంచి సామాజిక సమరసత వరకు
Read Latest Telangana News And Telugu News