Share News

ఏసీబీ మూసేసిన కేసులను మళ్లీ సమీక్షించాలి

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:50 AM

అవినీతి నిరోధక సంస్థ మూసేసిన కేసులన్నింటినీ తిరిగి సమీక్షించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కోరింది.

ఏసీబీ మూసేసిన కేసులను మళ్లీ సమీక్షించాలి

  • గవర్నర్‌కు ఎఫ్‌జీజీ లేఖ

హైదరాబాద్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక సంస్థ మూసేసిన కేసులన్నింటినీ తిరిగి సమీక్షించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కోరింది. ఈమేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. కేసులు ఆయా ప్రభుత్వ శాఖలకు చేరిన తర్వాత తారుమారవుతున్నాయని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని లేఖలో ప్రస్తావించారు.


ఏసీబీ డీజీ, విజిలెన్స్‌ కమిషన్‌ నివేదికలతో ప్రభుత్వం విభేదించి, కేసులను శాఖాపరమైన విచారణకు లేదా విచారణ కమిషనర్‌కు లేదాక్రమశిక్షణచర్యల ట్రైబ్యునల్‌కు పంపించి నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఈతరుణంలో ఏసీబీ మూసేసిన కేసులను సమీక్షించడానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను ఎఫ్‌జీజీ కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి:

‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్‌ఎస్‌ నేతల్లో ఆధిపత్య పోరు

అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 06:50 AM