Share News

ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు..!

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:58 AM

మహా నిమజ్జనం నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌ వద్ద ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు మొదలయ్యాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌ బండ్‌పై మంగళవారం 15 క్రేన్లు ఏర్పాటు చేశారు.

ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు..!
Tank Bund Ganesh Nimajjanam

  • మహా నిమజ్జనానికి మొదలైన ఏర్పాట్లు

  • నేడు లేదా రేపటి నుంచి నిమజ్జనాలు

హైదరాబాద్‌ సిటీ/కవాడిగూడ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మహా నిమజ్జనం నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌ వద్ద ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు మొదలయ్యాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌ బండ్‌పై మంగళవారం 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. నిజానికి, ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి వీలు లేకుండా బ్యారికేడ్లు పెట్టారు. కానీ, ఎప్పట్లానే హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహ నిమజ్జనం జరగాల్సిందేనంటూ భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం ట్యాంక్‌బండ్‌కు వచ్చిన ఆ సమితి ప్రతినిధులు.. ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యారికేడ్లను తొలగించారు.


ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొనగా విషయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో స్పందించిన జీహెచ్‌ఎంసీ... వినాయక విగ్రహాల నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌ మీద అవసరమైన ఏర్పాట్లు మొదలుపెట్టింది. 25వ తేదీన మహానిమజ్జనం రోజు భారీగా విగ్రహాలు రానున్న నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు అమర్చారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా మహా నిమజ్జనం జరుగుతుందని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం లేదా గురువారం నుంచి ట్యాంక్‌బండ్‌పై నుంచి వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతినిచ్చే అవకాశముందని సంబంధిత అధికారులు కూడా చెబుతున్నారు. కాగా, వినాయక చవితి మరుసటి రోజు నుంచే ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్ముకునేందుకే ఆయుధాల చోరీ!

మాయమాటలతో బాలికను లోబర్చుకొని.. ఆ ఘటనంతా వీడియో తీసిన 17 ఏళ్ల బాలుడు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 05:58 AM