అంజయ్య జీవితం స్పూర్తి దాయకం
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:10 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య కార్మికుడిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మాజీ సీఎం టంగుటూరి అంజయ్య జీవితం నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శనీయం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
సామాన్య కార్మికుడి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన నేత
ముఖ్యమంత్రిగా పని చేసినా అతి సామాన్య జీవితం
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య కార్మికుడిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మాజీ సీఎం టంగుటూరి అంజయ్య జీవితం నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శనీయం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మాజీ సీఎం, కేంద్ర మాజీ కార్మికశాఖ మంత్రి అంజయ్య 40వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి మహేశ్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిమిత విద్యాభ్యాసం చేసినా సామాన్యులు, కార్మికుల కష్టాలపై అంజయ్యకు లోతైన అవగాహన ఉండేదన్నారు. పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి, మంచి నేతగా గుర్తింపు పొందిన అంజయ్య.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనస్సును చూరగొన్న నాయకుడిగా నిలిచారన్నారు. కృషి, ఓర్పు, ప్రజల పట్ల నిబద్ధత, అంకిత భావంతో పని చేస్తే సామాన్య కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదగవచ్చునని అంజయ్య నిరూపించారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వి.హనుమంతరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, అంజయ్య మనుమడు అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్‌కో నుంచే...
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International