Share News

సహోద్యోగి పింఛన్‌ ప్రతిపాదనలు పంపేందుకు లంచం

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:34 AM

ఉద్యోగ విరమణ పొందిన సహచర మహిళా ఉద్యోగి పింఛన్‌ ప్రతిపాదనలను పంపేందుకు లంచం డిమాండ్‌ చేసిన ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

సహోద్యోగి పింఛన్‌ ప్రతిపాదనలు పంపేందుకు లంచం
Suryapet Employees Suspended

  • సూర్యాపేట షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖలో ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు

  • 8 ఓ రిటైర్డ్‌ మహిళా అధికారిపై శాఖాపరమైన విచారణ

సూర్యాపేట, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ విరమణ పొందిన సహచర మహిళా ఉద్యోగి పింఛన్‌ ప్రతిపాదనలను పంపేందుకు లంచం డిమాండ్‌ చేసిన ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. సూర్యాపేట షెడ్యూల్‌ కులాల(ఎస్సీ) అభివృద్ధి శాఖకు చెందిన సీనియర్‌ అసిస్టెంట్‌ జి. రవివర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ బి.యాదగిరి, అటెండర్‌ బి.రామును సస్పెండ్‌ చేస్తూ ఆ జిల్లా కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్‌ కులాల(ఎస్సీ) అభివృద్ధి శాఖకు చెందిన ఓ మహిళా ఉద్యోగి గత మార్చి నెలలో ఉద్యోగ విరమణ చేశారు.


ఆమెకు రావల్సిన పింఛన్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. అయితే, అదే శాఖలో విధులు నిర్వర్తించి ఆగస్టు నెలలో ఉద్యోగ విరమణ చేసిన మహిళా అధికారి, సంబంధిత విభాగ ఉద్యోగులు ఆ ప్రతిపాదనలు పంపేందుకు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్‌ చేశారు. అడిగిన మొత్తం ఇస్తేనే ఫైలుపై సంతకాలు చేసి ప్రతిపాదనలు పంపుతామని తేల్చిచెప్పారు. నెలలు గడుస్తున్నా ఫించను ప్రతిపాదనల ఫైలును సిద్ధం చేయకపోవడంతో సదరు మహిళ ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేసిన మాట వాస్తవమేనని తేలడంతో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. అలాగే, ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ మహిళా అధికారిపై సమగ్ర విచారణకు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆయిల్‌పామ్‌ రైతులకు రక్షణ కల్పించాలి

తెలంగాణ బయట బీడీఎస్‌ చదివితే పీజీ డెంటల్‌కు నాన్‌ లోకల్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 06:34 AM