Share News

యూపీఐపై ఎండీఆర్‌.. పన్ను కాదు.. సెస్‌ కాదు

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:24 AM

యూపీఐ చెల్లింపులపై విధించే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

యూపీఐపై ఎండీఆర్‌.. పన్ను కాదు.. సెస్‌ కాదు
nirmala

ఎండీఆర్‌లో ప్రభుత్వానికి ఒక్క పైసా రాదు: నిర్మల

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: యూపీఐ చెల్లింపులపై విధించే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఎండీఆర్‌ చార్జీ అనేది పన్ను కాదు.. సెస్‌ కాదు.. సర్‌చార్జీ కూడా కాదని శుక్రవారం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ స్పష్టంచేశారు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థను సాంకేతికంగా మరింత బలోపేతం చేసేందుకే ఎండీఆర్‌ చార్జీలను విధిస్తున్నట్లు వెల్లడించారు. యూపీఐ వినియోగదారులపై ఎలాంటి భారం పడదని స్పష్టంచేశారు.

Updated Date - Sep 26 , 2026 | 05:24 AM