Share News

జూబ్లీహిల్స్‌ సీఐకీ సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట..

ABN , Publish Date - Sep 22 , 2026 | 03:10 PM

మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్‌ వేటు పడిన జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

జూబ్లీహిల్స్‌ సీఐకీ సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట..
Jubilee Hills CI Srinivasulu Reddy

ఢిల్లీ, సెప్టెంబర్ 22: మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్‌ వేటు పడిన జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు శ్రీనివాసు రెడ్డిని అరెస్టు చేయవద్దని లేదా అతడిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మంగళవారం ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పై విధంగా హైదరాబాద్ నగర పోలీసులను ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.


ఓ మహిళను జూబ్లీహిల్స్ మాజీ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అతడిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో అతడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీఐ శ్రీనివాసులు రెడ్డి సవాల్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ చేతకానితనం వల్లే ఆదిలాబాద్ రిమ్స్ ప్రమాదం: కేటీఆర్..

‘పవన్ అన్నా.. నిన్ను కలవాలి’.. చిన్నారి కోరిక నెరవేర్చిన డిప్యూటీ సీఎం

For More TG News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 03:26 PM