Share News

‘పవన్ అన్నా.. నిన్ను కలవాలి’.. చిన్నారి కోరిక నెరవేర్చిన డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Sep 22 , 2026 | 03:04 PM

‘పవన్ అన్నా.. నిన్ను కలవాలన్న నా ఆశను నెరవేర్చండి’ అంటూ ప్లకార్డుతో వేడుకున్న అంధ విద్యార్థిని నల్ల జ్యోతి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. జ్యోతి కోరికను ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. చిన్నారిని స్వయంగా కలుసుకుని ఆమెతో మాట్లాడారు.

‘పవన్ అన్నా.. నిన్ను కలవాలి’.. చిన్నారి కోరిక నెరవేర్చిన డిప్యూటీ సీఎం
Nalla Jyothi Meets Pawan Kalyan

ఇంటర్నెట్ డెస్క్: ‘పవన్ అన్నా.. అంధురాలినైన నేను నిన్ను కలవాలన్న నా ఆశను నెరవేర్చండి’ అంటూ సెప్టెంబరు 21న ఓ ప్లకార్డుతో పిఠాపురం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద నిలబడిన ఐదో తరగతి విద్యార్థిని నల్ల జ్యోతి అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తపల్లి మండలం ముమ్మిడివారిపోడుకు చెందిన జ్యోతి విశాఖపట్నంలోని భీమిలి నేత్ర విద్యాలయంలో చదువుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవాలన్నదే తన కోరిక అని, ఆయన తనను పిలుస్తారని ఆశిస్తున్నట్లు జ్యోతి తెలిపింది. ఈ విషయాన్ని ఆమె 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కి వివరించింది.


జ్యోతి కోరికను ‘ABN ఆంధ్రజ్యోతి’ పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో స్పందించిన పవన్ కల్యాణ్ ఈ రోజు (మంగళవారం) ఆ చిన్నారిని కలిశారు. తన అభిమాన నాయకుడిని కలవాలన్న కోరిక నెరవేరడంతో జ్యోతి ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. పవన్‌ను కలిసిన సందర్భంగా ఆమె ఆనందంతో మురిసిపోయింది.

Also Read:

టీచర్లపై గంజాయి, బ్లేడ్ బ్యా‌చ్‌లతో దాడులు దారుణం: మంత్రి నిమ్మల

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

Updated Date - Sep 22 , 2026 | 03:10 PM