సుప్రీంకోర్టులో నేషనల్ హైవేస్ అథారిటీకి గట్టి ఎదురుదెబ్బ!
ABN , Publish Date - May 25 , 2026 | 06:36 PM
భూ వివాదంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 'స్టే' ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
న్యూఢిల్లీ, మే 25: భూ వివాదంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 'స్టే' ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భూములు కోల్పోయిన యజమానులు పెంచిన నష్ట పరిహారాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ససేమిరా అంది. యాదాద్రి - వరంగల్ నేషనల్ హైవే భూసేకరణ వివాదంలో భూ యజమానులకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్టు ఆదేశాలు యథాతథంగా సుప్రీంకోర్టు ఉంచినట్లు అయింది.
దాంతో రైతులకు భారీ ఉపశమనం కలిగినట్లు అయింది. అలాగే అధికారులు పెంచిన నష్టపరిహార మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని రైతులకు వెల్లడించింది. నగదు విత్‌డ్రా చేసుకుంటే తర్వాత రికవరీ కష్టమన్న ఎన్‌హెచ్‌ఏఐ వాదనను ఈ కేసు విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం ఆర్థిక భారాన్ని సాకుగా చూపి భూ బాధితులకు అందాల్సిన న్యాయమైన పరిహారాన్ని ఆపలేరని స్పష్టం చేసింది. కోర్టు విధించిన షరతులకు లోబడి పెరిగిన పరిహారం మొత్తాన్ని తెలంగాణ భూయజమానులు విత్‌డ్రా చేసుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..
మహానాడుకు వైసీపీ మీటింగ్ దిష్టి చుక్క లాంటిది: మంత్రి రాంప్రసాద్
Read Latest TG News And Telugu News