Share News

చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..

ABN , Publish Date - May 25 , 2026 | 04:57 PM

టాలీవుడ్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజ్ విధానం అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది.

చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..
Chiranjeevi

హైదరాబాద్, మే 25: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజ్ విధానం అమలు చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. దీనిపై చర్చించేందుకు సోమవారం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణతోపాటు ఎగ్జిబిటర్స్ చేరుకున్నారు. పర్సంటేజ్ విధానంపై చిరంజీవితో వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో సునీల్ నారంగ్, బాలగోవింద్, అనుపమ్ రెడ్డి, శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. మరో వైపు ఫిలిం చాంబర్ సబ్ కమిటీ ఇచ్చిన సూచనలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


మల్టీప్లెక్స్‌ల కన్నా తక్కువైనా పర్లేదు.. తమకు పర్సంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదీకాక రామ్‌చరణ్ తేజ్ నటించిన పెద్ది చిత్రం నుంచి ఈ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతలు అన్నట్లుగా వివాదం ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో ఈ సమస్య పరిష్కారమయ్యేనా? అనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్‌లో కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు

వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 25 , 2026 | 05:04 PM