పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:46 PM
మైక్రో ఫైనాన్స్ పేరిట సింగర్ మంగ్లీ రూ.10 కోట్లు మోసం చేశారని సింగపోగు సుబ్బు అనే న్యాయవాది పోలీసులను ఆశ్రయించాడు. అయితే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ తాజాగా పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్, ఏప్రిల్12: ప్రముఖ గాయని మంగ్లీపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరిట ఆమె రూ.10 కోట్లు మోసం చేశారని సింగపోగు సుబ్బారావు అనే న్యాయవాది పోలీసులను ఆశ్రయించాడు. అయితే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. తనపై ఆరోపణలు చేసిన న్యాయవాదిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
రూ.10 కోట్లకు మోసం చేశానంటూ తనపై సుబ్బు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొంది. తన కార్యాలయం వద్దకు వచ్చి 10 లక్షలు డిమాండ్ చేశాడని, నిరాకరిస్తే అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరించాడని ఆరోపించింది. తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్ల వీడియో చూపించి బెదిరించాడని, మరో వ్యక్తితో కలిసి అవమానకరంగా మాట్లాడాడని ఫిర్యాదులో తెలిపింది. సుబ్బారావు తీరుతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంగ్లీ కోరింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి