Share News

సిద్దిపేటలో పేకాట మాజీ ఎమ్మెల్సీ సహా నలుగురి అరెస్టు

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:52 AM

సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌ రెడ్డితోపాటు నలుగురు వ్యక్తులను సిద్దిపేట టూ టౌన్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.

సిద్దిపేటలో పేకాట మాజీ ఎమ్మెల్సీ సహా నలుగురి అరెస్టు
former MLC arrested

సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌ రెడ్డితోపాటు నలుగురు వ్యక్తులను సిద్దిపేట టూ టౌన్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. సిద్దిపేట టూ టౌన్‌ సీఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటలోని మహాశక్తినగర్‌ వాసి, మాజీ ఎమ్మె ల్సీ కూర రఘోత్తమ్‌ రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి పేకాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో దాడి చేశారు.


తాము దాడి చేసినప్పుడు పేకాడుతున్న కూర రఘోత్తమ్‌ రెడ్డి, గోవిందాపురం కనకయ్య, పంతం వెంకట్రాజ్యం, సిద్ధంకి రమేష్‌, లను అరెస్ట్‌ చేశామన్నారు. తము రాకను గమనించిన గంగాసాని భాస్కర్‌ రెడ్డి, గంగుల బాలు ,మధుసూదన్‌ రెడ్డి కిటికీ నుండి దూకి పారి పోయారని పోలీసులు చెప్పారు. ఘటనాస్థలంలో రూ.11,960 నగదుతోపాటు 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..
‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’కు పకడ్బందీ ఏర్పాట్లు

డోర్‌ డెలివరీ@‘మీ-సేవ’

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 06:52 AM