Share News

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:18 PM

ఆర్టీసీ సమ్మె సమయంలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నేరవేర్చింది. ఈ మేరకు ఆయన కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగాన్ని కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం
shankar goud son tsrtc job compensation

హైదరాబాద్, నవంబర్ 12: ఆర్టీసీ సమ్మె సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఇచ్చిన మాటను.. ప్రభుత్వం నిలబెట్టుకుంది. శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్‌ను అందచేసింది.


ఆర్టీసీ సమ్మె సమయంలో తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ.. గతంలో నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆనాడే.. తెలంగాణ ప్రభుత్వం మాట ఇచ్చింది. ఈ మేరకు శంకర్ గౌడ్ కుమారుడు.. హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగాన్ని కల్పిస్తూ.. ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన్ను రికార్డ్ ట్రెజర్‌గా నియమిస్తూ నియామక పత్రం అందజేసింది. ఈ నియామక పత్రాన్ని రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తమ చేతుల చేతుల మీదుగా హేమంత్ గౌడ్‌కు అందించారు. అంతేకాకుండా.. శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ తరఫున పరిహారాన్ని అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగులు.. తమ ఒక్క రోజు వేతనం కోటి రూపాయలను.. శంకర్ గౌడ్ కుటుంబానికి నష్టపరిహారంగా అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్

ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తాం

Updated Date - Nov 12 , 2026 | 03:56 PM