కేసీఆర్ చావును నేను కోరడం లేదు
ABN , Publish Date - Sep 10 , 2026 | 04:51 AM
‘కేసీఆర్ చావును నేను కోరడం లేదు, ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో ఫ్లోలో అలా వచ్చింది’’ అని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.
విలేకరి అడిగిన ప్రశ్నకు ఫ్లోలో అలా మాట్లాడాను
ఆయన అసెంబ్లీకి వస్తే రెట్టింపు మర్యాద ఇస్తాం
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ
షాద్‌నగర్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్ చావును నేను కోరడం లేదు, ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో ఫ్లోలో అలా వచ్చింది’’ అని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక వీడియోలో వివరణ ఇచ్చారు. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు ఎంత గౌరవం ఇచ్చామో, ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తే అంతకు రెట్టింపు మర్యాద ఇస్తాం. ఒకరి చావును కోరడం ఏమాత్రం సమర్థనీయం కాదు. అలాగే, గతంలో కేటీఆర్.. రాహుల్ గాంధీని ‘ఎక్కడ చచ్చావ్?’ అనడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్‌ఎస్ నేతలు తమ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను, మహిళా మంత్రులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఆ బూతులు వినలేక వారి కుటుంబ సభ్యులే తలదించుకుంటున్నారు. తెలంగాణ.. కేసీఆర్ కుటుంబానికే పరిమితం కాదు, అది నాలుగు కోట్ల మంది ప్రజలది. కేసీఆర్ ఫాంహౌ్‌సకే పరిమితం కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి’’ అని వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And National News
And Telugu News