Share News

తక్షణమే పీఆర్సీ నివేదిక

ABN , Publish Date - Sep 10 , 2026 | 03:37 AM

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను తక్షణమే తెప్పించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రిపోర్టును త్వరగా అందజేయాలంటూ పీఆర్సీని ఆదేశించింది.

తక్షణమే పీఆర్సీ నివేదిక
PRC

  • సీపీఎస్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయం

  • ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై సర్కారు సానుకూలత

  • సీఎస్‌ ఆధ్వర్యంలో సంఘాల నేతలతో కీలక సమావేశం

  • త్వరగా నివేదికను సమర్పించాలంటూ పీఆర్సీకి సీఎస్‌ ఆదేశాలు

  • పెండింగ్‌ కరువు భత్యాలపై 18న మరోసారి భేటీ

  • నేటి ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని వాయిదా వేసిన జేఏసీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను తక్షణమే తెప్పించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రిపోర్టును త్వరగా అందజేయాలంటూ పీఆర్సీని ఆదేశించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)పై అధ్యయానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పెండింగ్‌ కరువు భత్యాల(డీఏ)పై ఈ నెల 18న మరోసారి సమావేశాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 10న నిర్వహించతలపెట్టిన ‘చలో హైదరాబాద్‌’ నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నామని మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలోని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ) ప్రకటించింది. ఈ జేఏసీ నేతలతో పాటు లచ్చిరెడ్డి చైర్మన్‌గా గల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ) నాయకులతో బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్హర్‌ మహేశ్‌ దత్‌ ఎక్కా పాల్గొన్నారు. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న 6 కరువు భత్యాల(డీఏ) విడుదల, ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రూ.10 వేల కోట్ల బకాయిల విడుదల, సీపీఎస్‌ ఉపసంహరణ, నూతన వైద్య బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయడం, ఇతర పెండింగ్‌ సమస్యలపై సమావేశంలో చర్చ జరిగింది. సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధాన పునరుద్ధరణపై అధ్యయనానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. పీఆర్సీ సభ్యులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది.. తర్వాత 3 నెలల్లో దీనిపై నివేదిక ఇచ్చేలా చర్చ జరిగింది. ఒకవేళ 18న డీఏలపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రానట్లయితే, 19న జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తదుపరి కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తామని టీజీఈజేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. గురువారం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.


సభ తర్వాతే సానుకూలత: లచ్చిరెడ్డి

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీజీఈజేఏసీ)తో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్చలు జరిపిందని చైర్మన్‌ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్‌ వడ్నాల రాజశేఖర్‌ తెలిపారు. 6న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉద్యోగుల సంకల్ప సభ’ అనంతరం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, చర్చలకు ఆహ్వానించిందన్నారు.


సీపీఎస్‌ రద్దు చేయాలి: సీపీఎస్‌ఈయూ

సీపీఎ్‌సపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడానికి ఆహ్వానిస్తున్నామని ‘తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (టీఎ్‌ససీపీఎ్‌సఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, రాష్ట్ర కోశాధికారి నరేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. నవంబరు 17 నాటికి సీపీఎస్‌ రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.


వాయిదా ఊహించిందే: జేఎస్‌సీ

ఉద్యోగుల సమస్యల సాధనకు ఉద్యోగుల జేఏసీలు ఇచ్చిన ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం తాము ఊహించిందేనని ‘జాయింట్‌ స్ట్రగుల్‌ కమిటీ ఆఫ్‌ ఎంప్లాయిస్‌, టీచర్స్‌, వర్కర్స్‌, పెన్షనర్స్‌, ఔట్‌సర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌’ రాష్ట్ర చైర్మన్‌ టి.ప్రభాకర్‌, సమన్వయకర్త సయ్యద్‌ షౌకత్‌ అలీ తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రస్తుతమున్న రెండు జేఏసీలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈహెచ్‌ఎస్‌ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క

త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 03:37 AM