ఉద్యోగి ఇంట్లో భారీ దొంగతనం

ABN , First Publish Date - 2023-03-22T23:34:29+05:30 IST

కోసిగిలోని 8వ వార్డులో నివాసముంటున్న కరెంటు ఉద్యోగి శ్రీనివాసులు ఇంట్లో మంగళవారం దొంగతనం జరిగింది.

       ఉద్యోగి ఇంట్లో భారీ దొంగతనం

కోసిగి, మార్చి 22: కోసిగిలోని 8వ వార్డులో నివాసముంటున్న కరెంటు ఉద్యోగి శ్రీనివాసులు ఇంట్లో మంగళవారం దొంగతనం జరిగింది. శ్రీనివాసులు, లక్ష్మి దంపతులు కౌతాళం మండల పరిధిలోని రౌడూరు గ్రామంలో జట్టప్పతాత మఠానికి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారు. బుధవారం ఉదయం వారి ఇంటి ముందు వున్న తాగునీటి కొళాయికి వచ్చిన కాలనీవాసులు శ్రీనివాసులు ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీంతో శ్రీనివాసులు వచ్చి పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశారు. బీరువాలో తమ కొత్త ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన రూ.3.50 లక్షల నగదు, 13 తులాల బంగారు, 46 తులాల వెండి దొంగలు అపహరించుకు పోయినట్లు బాధితులు తెలిపారు. ఎస్‌ఐ రాజారెడ్డి కర్నూలు క్లూజ్‌టీమ్‌ ఆధ్వర్యంలో దొంగల వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-03-22T23:34:29+05:30 IST