Share News

బీఆర్‌ఎస్‌ నేతలకు కేసీఆర్‌ నేర్పిన సంస్కారం ఇదేనా?

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:23 AM

నిజామాబాద్‌ జిల్లా ఇంచార్జ్‌ మంత్రిగా ఉన్న తనపై బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సిగ్గుందా అని చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు.

బీఆర్‌ఎస్‌ నేతలకు కేసీఆర్‌ నేర్పిన సంస్కారం ఇదేనా?
Seethakka

  • తనపై బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీతక్క భావోద్వేగం

  • బీఆర్‌ఎస్‌ నేతలకు మహిళలంటే గౌరవం లేదని విమర్శలు

  • తనతో పెట్టుకున్న వాళ్లు మట్టికొట్టుకుపోతారని ఘాటు వ్యాఖ్యలు

నిజామాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లా ఇంచార్జ్‌ మంత్రిగా ఉన్న తనపై బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సిగ్గుందా అని చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్‌ఎస్‌ నేతలకు కేసీఆర్‌ నేర్పిన సంస్కారం ఇదే అయితే ఆడబిడ్డలందరూ ఆ పార్టీ నాయకులపై మన్నుపోస్తారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్‌లో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొత్త పింఛన్ల పెంపు విషయంలో ప్రశాంత్‌రెడ్డి అబద్ధాలు చెపుతున్నారని, తాను జిల్లా ఇంచార్జ్‌ మంత్రిగా సాధ్యమైనంత వరకు జిల్లాను అభివృద్ధి చేస్తుంటే తనపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.


జిల్లా ప్రజలు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశాంత్‌రెడ్డిని ప్రశ్నించారు. మహిళలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓర్వలేక తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మహిళగా చిన్న కులానికి చెందిన వ్యక్తి జిల్లా ఇంచార్జ్‌ మంత్రిగా ఉండడం ప్రశాంత్‌రెడ్డికి ఇష్టం లేదన్నారు. తాను మంత్రి అయినప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని సోషల్‌ మీడియాలో తనపై రోజూ విష ప్రచారం చేస్తున్నారన్నారు. తనది కాళ్లు మొక్కించుకునే సంస్కృతి కాదని, అలాంటి దొరలను తరిమికొట్టిన సంస్కృతి తనదన్నారు. తనను అన్నవాళ్లు ఎవరూ బాగుపడలేదని బీఆర్‌ఎస్‌ నేతలకు కూడా అదే గతి పడుతుందన్నారు. కేసీఆర్‌ బిడ్డ కూడా ప్రశాంత్‌రెడ్డి వెన్నుపోటు పొడిచాడని తిట్టిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 05:23 AM