Share News

ఫ్యూచర్ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌ ఏర్పాటు.. 10 ఎకరాలు కేటాయించిన సర్కార్

ABN , Publish Date - Sep 17 , 2026 | 07:26 PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నగరం ఫ్యూచర్ సిటీ. ఈ సిటీలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చేరింది. ఫ్యూచర్ సిటీలో తన సొంత మెగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది.

ఫ్యూచర్ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌ ఏర్పాటు.. 10 ఎకరాలు కేటాయించిన సర్కార్

హైదరాబాద్‌, సెప్టెంబర్ 17: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నగరం ఫ్యూచర్ సిటీ. ఈ సిటీలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చేరింది. ఫ్యూచర్ సిటీలో తన సొంత మెగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది. అందుకోసం రంగారెడ్డి జిల్లాలోని మీర్‌ఖాన్‌పేట పరిధిలో 10 ఎకరాల స్థలాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కేటాయించింది.


తొలుత ఈ డేటా సెంటర్‌కు 8 ఎకరాల వరకు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం భావించింది. కానీ ఎస్‌బీఐ అభ్యర్థన మేరకు 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించింది. మీర్‌ఖాన్‌పేట ప్రస్తుతం అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలకు హబ్‌గా మారుతోంది. అయితే అమెజాన్ సంస్థ కూడా ఇదే ప్రాంతంలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులైలో ఈ సంస్థ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల్లో ఉమ్మడి అజెండాతో వెళ్లనున్న కూటమి పార్టీలు: మంత్రి సత్యకుమార్

జోసెఫ్ రావణ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు
For More TG News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 07:44 PM