Share News

ఎన్నికల్లో ఉమ్మడి అజెండాతో వెళ్లనున్న కూటమిలోని పార్టీలు: సత్యకుమార్

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:57 PM

గన్నవరం సామాజిక ఆసుపత్రిలో వైద్య శిబిరాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమిలోని పార్టీలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో ఉమ్మడి అజెండాతో వెళ్లనున్న కూటమిలోని పార్టీలు: సత్యకుమార్
ap minister Satya Kumar

విజయవాడ, సెప్టెంబర్ 17: కూటమిలో ఎప్పుడు విభేదాలు వస్తాయా? అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోతికాడ గుంటనక్కలా ఎదురు చూస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యంగ్యంగా అన్నారు. గురువారం గన్నవరం సామాజిక ఆసుపత్రిలో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు సమన్వయంతో పని చేస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఉమ్మడి అజెండాతో ప్రజల ముందుకు వెళ్లతాయని పేర్కొన్నారు.


సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తోపాటు బీజేపీ నాయకత్వం దీర్ఘకాలం కలిసి పనిచేయాలని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 15, 20 ఏళ్ల పాటు కూటమి కొనసాగాలనే ఆలోచన వారిలో ఉందని అన్నారు. ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఈ మూడు పార్టీలు దృష్టి సారించాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జోసెఫ్ రావణ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు
ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ

For More AP News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 06:06 PM