Share News

జోసెఫ్ రావణ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:29 PM

యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ రావణ్‌ అంశంలో గన్నవరం కోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అతడిని వారం రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది.

జోసెఫ్ రావణ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు
josef ravan

విజయవాడ, సెప్టెంబర్ 17: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ రావణ్‌ అంశంలో గన్నవరం కోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అతడిని వారం రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో అతడిని గన్నవరం పోలీసులు శుక్రవారం కస్టడీకి తీసుకోనున్నారు. జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో విద్వేషపూరిత వీడియోలు చేశారు. అలాగే ఏలూరులో జరిగిన ఓ సమావేశంలో యువతను రెచ్చగొట్టేలా మాట్లాడడం, నక్సలిజం వైపు వెళ్లేలా మాట్లాడారనే ఆరోపణల నేపథ్యంలో అతడిపై ఉపా (యూఏపీఏ) కేసు నమోదైంది.


దాంతో జోసెఫ్ రావణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రావణ్ వీడియోల వెనుక ఉన్న నెట్‌వర్క్‌, మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లతో సంబంధాలతోపాటు రాజకీయ లబ్ధి ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో అతడిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న కోర్టు.. జోసెఫ్ రావణ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు.. సిట్‌ ఎదుట ఏ4 సురేశ్ లొంగుబాటు

ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ

For More AP News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 05:44 PM