సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై మరో కేసు నమోదు
ABN , Publish Date - Apr 21 , 2026 | 01:06 PM
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు మరోసారి కేసు నమోదు అయింది. ఆర్థిక మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై సైబరాబాద్‌లోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు మరోసారి కేసు నమోదు అయింది. ఆర్థిక మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై సైబరాబాద్‌లోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేశారు. రూ.14 లక్షల మేర తమను మోసం చేశారంటూ ఆయనపై ఢిల్లీ సంస్థ ఎథెనా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిర్యాదు చేసింది. ఫోర్జరీ డాక్యమెంట్లు నకిలీ డాక్యుమెంట్లతో తమను మోసం చేశారంటూ సదరు సంస్థ ప్రతినిధులు పోలీసులకు వివరించారు.
ఈ వ్యవహారంలో శ్రీధర్ రావు భార్య సంధ్య భాగస్వామ్యం ఉందని ఆ పిర్యాదులో స్పష్టం చేశారు. ఎథెనా ప్రాజెక్ట్ ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీధర్ రావు దంపతులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా శ్రీధర్ రావుపై పలు భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివిధ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజా ఈ కేసు నమోదు కావడంతో.. శ్రీధర్ రావు చుట్టు ఉచ్చు మరింత బిగ్గుస్తుందనే ప్రచారం జరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సమ్మె విరమించండి.. ఆర్టీసీ కార్మికులకు పొన్నం సూచన
బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఆ సభలు: రాంచందర్ రావు
For More TG News And Telugu News