Share News

సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు

ABN , Publish Date - Sep 03 , 2026 | 03:40 AM

గిరిజన ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా మలుగులోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం మరో ముందడుగు వేసింది.

సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు
Sammakka Sarakka University

ములుగు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా మలుగులోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం మరో ముందడుగు వేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన నూతన అకాడమిక్‌ ప్రోగ్రామ్‌లను గురువారం ప్రారంభించనున్నట్లు వర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. వర్సిటీ ట్రాన్సిట్‌ క్యాంప్‌సలో ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌-హైదరాబాద్‌) భాగస్వామ్యంతో ఈ కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు జాతీయ స్థాయి నాణ్యతా ప్రామాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు, ఉన్నత విద్యలో మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవానికి ఐఐటీ హైదరాబాద్‌ సీనియర్‌ ప్రొఫెసర్లు, టిస్‌-హైదరాబాద్‌ డైరెక్టర్‌ ముఖ్య అతిథితులుగా హాజరుకానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ తయారీ

డాక్టర్‌.. ఎస్సెస్సీ..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 03:40 AM